Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమ విఫ‌ల‌మా...ఆ రోజు ఏం జ‌రిగింది...?

ప్రేమ విఫ‌ల‌మా…ఆ రోజు ఏం జ‌రిగింది…?

  • యూట్యూబ‌ర్ కోమలి ఆత్మ‌హ‌త్య‌..?

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: యూట్యూబ‌ర్ కోమ‌లి ఒక ప క్క చ‌దువుతూనే మ‌రొక‌ప‌క్క‌ యూట్యూబ‌ర్ గా  రాణిస్తూనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కోమ‌లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాగా గ‌త‌ మూడు సంవ‌త్స‌రాలుగా మ‌రొక యూట్యూబ‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

ప్రేమా విఫ‌ల‌మా..అస‌లు ఏం జ‌రిగింది తెలుసుకోవాలంటే ప్ర‌ముఖ యూట్యూబ‌ర్‌ కోమ‌లి మ‌ణికొండ చిత్ర‌పురి కాల‌నీలో త‌న మామ ఇంటిలో ఉంటూ చ‌దువుకుంటూ ఒక ప‌క్క‌ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంది. కాగా మ‌రొక య్యూటుబ‌ర్ అయిన‌టువంటి అఖిల్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే మ‌రొక ప‌క్క యూట్యూబ‌ర్‌గా రాణిస్తున్నారు.

వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్పడ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రు మూడు సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు రాగా సంవ‌త్స‌ర కాలంగా దూరంగానే ఉంటున్నారు. అయితే అఖిల్‌ను మ‌రిచిపోలేని కోమ‌లి గ‌త రెండు రోజుల క్రితం ఫోన్ చేయ‌గా ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. తీవ్ర మ‌న‌స్తాపానికై గురైన కోమ‌లి
ఇంటిలో ఎవ‌రు లేని స‌మ‌యంలోఫ్యాన్‌కు చీరెతో ఉరివేసుకున్న‌ట్లు తెలుస్తుంది.

తాజావార్తలు