
లోకేష్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైందా..? మహానాడులో కీలక ప్రకటన రాబోతోందా…? పార్టీలో కీలక పదవిని లోకేష్‌కు అప్పగించబోతున్నారా…? అంటే అవుననే సమాచారం వస్తోంది. సీఎం చంద్రబాబు… వారసుడికి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. లోకేష్‌కు అప్పగించబోయే కీలక బాధ్యతలు ఏంటి..? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవా..? లేక.. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్టా…? ఏమో.. అది మహానాడులోనే తెలుస్తుందని అంటున్నాయి టీడీపీ వర్గాలు.
మే 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహిస్తోంది తెలుగు దేశం పార్టీ. ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తున్నా… ఈసారి మహానాడు వేరు. ఎందకంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 75ఏళ్లు వసంతాలు పూర్తిచేసుకున్న తర్వాత జరుపుకుంటున్న మొదటి మహానాడు. టీడీపీలో.. చంద్రబాబుతో సమానంగా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, అశోక్‌గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు.. ఇలా చాలా మందే ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చంద్రబాబుకు అండదండగా ఉన్నవారే. వీరిలో చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని… వారసులను దింపారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు వారసుడుగా లోకేష్‌కు.. పార్టీలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన పార్టీలోని చాలా మందిలో ఉంది. లోకేష్ కూడా అందుకు తగ్గ పనితీరును మెరుగుపరుచుకున్నారు. అనధికారికంగా పార్టీ బాధ్యతలను చక్కబెడుతున్నారు. రామ్మోహన్‌నాయుడితోపాటు… సీనియర్ నేతల వారసులంతా లోకేష్ టీమ్‌లో ఉన్నారు. రెడ్‌బుక్ పేరుతో వైసీపీ నేతలను కూడా గడగడలాడిస్తున్నాడు లోకేష్. దీంతో… లోకేష్‌కు పార్టీలో కీలక పదవి అప్పగించి.. పార్టీ బావి నాయకుడిగా ప్రకటించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మహానాడులో.. దీనిపై ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం.
ఇటీవల.. మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని కూడా కలిశారు. దీని వెనుక కూడా చంద్రబాబు వ్యూహం ఉందన్న ప్రచారం జరిగింది. టీడీపీలో లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించి.. ఆయనకు పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మహానాడులో ఆ ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో… ప్రధాని మోడీ ఆశీస్సులు లోకేష్‌కు ఉండేలా చంద్రబాబు పావులు కదిపారు. అందులో భాగంగానే లోకేష్.. ప్రధాని మోడీని కలిసినట్టు సమాచారం. టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు… లోకేష్‌కు ప్రధాని మోడీ ఆశీర్వాదం లభించినట్టు సమాచారం. అందుకే.. మోడీతో సమావేశంలో… లోకేష్ చాలా సంతోషంగా, మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపించారని అంటున్నారు.
మహానాడులో చంద్రబాబు చేయబోయే ప్రకటన ఏంటి…? లోకేష్‌కు పార్గీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారంటే… ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు…? వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారా..? లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగిస్తారా..? అదీ కాదంటే.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని లోకేష్‌కు కట్టబెడతారా..? ఏమో చంద్రబాబు మదిలో ఏముందో… మహానాడు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో..? తెలుసుకోవాలంటే… అప్పటి వరకు ఆగాల్సిందే.