
లోకేష్ పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా…? చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లోకేష్ రెడీ అవుతున్నారా..? అంటే… అమరావతి పోస్టర్ చూసిన వాళ్లందరూ అవును అనే సమాధానం ఇస్తున్నారు. అమరావతి పునర్‌నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి మోడీ వస్తున్న సందర్భంగా… భారీగా ప్రకటనలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇన్విటేషన్ పోస్టర్లు, పాంప్లెట్లు కూడా వేయించింది. అయితే… ఇందులో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫొటోలు ఉండటం సహజం. ఆ తర్వాత… మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఫొటో ఉండాలి. కానీ… ఇక్కడ అలా జరగలేదు. పోస్టర్‌లో సీఎం చంద్రబాబును హైలెట్ చేశారు… పైన చిన్నగా పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టారు… ఆయన పక్కనే మంత్రి లోకేష్ ఫొటో పెట్టారు. ఈ పోస్టర్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి చోటు దక్కలేదు.
Also Read : అజ్ఞాతంలో మరో వైసీపీ నేత – అరెస్ట్ భయమేనా..?
పవన్ కళ్యాణ్ పక్కనే లోకేష్ ఫొటో పెట్టడంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమాన స్థాయిని లోకేష్‌కు కల్పిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక… మోడీ సభలో వేదికపై 15 మంది ప్రముఖులు మాత్రమే కూర్చునేందుకు అవకాశం కల్పించారు. అందులోనూ లోకేష్‌కు స్థానం కల్పిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ముందుచూపుతో చేస్తున్నారని… విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు తర్వాత… టీడీపీ పగ్గాలు చేపట్టాల్సింది ఆయన తనయుడు లోకేషే. అందుకుతగ్గట్టుగా… ఇప్పటి నుంచే లోకేష్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు.
Also Read : చక్రవ్యూహంలో వైసీపీ – పుంజుకోవడం కష్టమేనా…!
ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్నారంటే… అటు ప్రభుత్వంలోనూ… ఇటు పార్టీలోనూ ఆయనే కీలకమని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారని అర్థం. మోడీ సభలో వేదికపై లోకేష్‌ను కూర్చోబెట్టడం వెనుక.. చంద్రబాబు వ్యూహం కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రముఖులు, కేంద్ర మంత్రులు వస్తున్న ఈ కార్యక్రమంలో… లోకేష్‌ను ముందు పెడితే.. పరిచయాలు పెరుగుతాయని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. సరైన సమయం వచ్చాక… లోకేష్‌కు ఇలాగే పట్టాభిషేకం కూడా చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి …
-
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?
-
ఏకకాలంలో ప్రేమాయణం.. ఒకే మండపంలో పెళ్లి..
-
హస్తం పార్టీలో చెంపదెబ్బలు – ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ
-
ఉగ్రదాడి ఎఫెక్ట్- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..!
-
ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.