Monday, March 23, 2026
No menu items!
No menu items!
Homeఆంధ్ర ప్రదేశ్లోకేష్ నన్ను చంపేయాలని చూస్తున్నారు.. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు?

లోకేష్ నన్ను చంపేయాలని చూస్తున్నారు.. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వైరాలు ప్రతిరోజు కూడా ముదిరిపోతున్నాయి. అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే ఈ దాడుల తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వం పై అలాగే నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో మంత్రి లోకేష్ తనను హతమార్చాలని చూస్తున్నారు అని జోగి రమేష్ కీలక ఆరోపణలు చేశారు. లోకేష్ ఆదేశాలతోనే ప్రస్తుత ఎంపీ చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు అని వ్యాఖ్యానించారు. ఈ దాడులు జరగక ముందే తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో డీసీపీ మరియు సిఐ చర్చించారు అని అన్నారు. పోలీసుల సపోర్ట్ లేకపోతే వాళ్లు మా పై దాడులు చేసే వాళ్ళ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గుండాలు ర్యాలీగా పెట్రోల్ సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్ గా నిలబడి వచ్చారు అంటూ.. ఈ దాడులు ఇలానే కొనసాగితే కచ్చితంగా ప్రజలు మీపై తిరగబడక మానురు అని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో జోగి రమేష్ చేసిన ఈ ఆరోపణలు వైరల్ గా మారాయి.

Read also : కాలనీ అభివృద్ధి కై కదలిరండి.. ఆదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి రాధారెడ్డి

Read also : India–US Trade Deal: ముందు ప్రధాని మోడీతో ఫోన్ లో ట్రంప్ చర్చలు, ఆ తర్వాతే డీల్ ఖరారు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments