
చంద్రబాబుతో ఛాలెంజ్ చేశారు నారా లోకేష్. ఛాలెంజ్ చేయడమే కాదు… మాట కూడా నిలబెట్టుకున్నారు. అదేంటి… తండ్రిపైనే ఛాలెంజ్ చేయడం ఏంటి…? ఎందుకు చేసుంటారు…? ఏ విషయంలో చేసుంటారు…? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది అదేంటంటే… ఆ ఛాలెంజ్‌ఇప్పుడు చేసింది కాదు. 2024 ఎన్నికల ముందట. ఇంతకీ లోకేష్ చేసిన ఆ ఛాలెంజ్ ఏంటో చూద్దాం..!
మంత్రి నారా లోకేష్.. మంగళగిరి పర్యటనలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా… పేదలకు ఇళ్ల స్థలాలు పంచిన ఆయన… 2024, 2019 ఎన్నికల ముందు జరిగిన విషయాలను ప్రజలకు వివరించారు. తన గెలుపోటములు…. అప్పుడు తన రియాక్షన్స్ అన్నీ చెప్పారు. 2019 ఎన్నికల ముందు తాను ఎందుకు ఓడిపోయానో కూడా చెప్పారు లోకేష్. 2019 ఎన్నికలకు సరిగ్గా 21 రోజుల ముందే… మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. సమయం తక్కువగా ఉండటంతో… ప్రజలందరినీ కలవలేకపోరాయట. అందుకే… 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు. రిజల్ట్స్ వచ్చాక… ఓటమి విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు లోకేష్. అయితే… ఆ బాధ.. తనలో గెలవాలనే కసి పెంచిందట. ఓడిపోయినా… మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉన్నానని…. అభివృద్ధికి కృషిచేశానని చెప్పారు.
Also Read : టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీ..? – కండిషన్స్ అప్లై అంటున్న సోదరుడు చిన్ని
ఇక.. చంద్రబాబుతో ఛాలెంజ్ విషయాన్ని కూడా మంగళగిరి ప్రజలకు చెప్పారు నారా లోకేష్. 2024 ఎన్నికల ముందు… తండ్రితో సవాల్ చేశానన్నారు లోకేష్. కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజార్టీ కన్నా… ఒక్క ఓటు అయినా ఎక్కువ తెచ్చుకుంటానని చెప్పారట. అయితే… తన సవాల్‌ను మంగళగిరి ప్రజలు గట్టిగా నిలబెట్టారన్నారు. ఊహించని విధంగా 91 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించారని చెప్పారు లోకేష్. తండ్రితో ఛాలెంజ్ చేసి గెలవడమంటే.. చాలా గర్వంగా అనిపించిందని చెప్పారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని… అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు లోకేష్.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..