క్రైమ్తెలంగాణరాజకీయం

ఒక్క మండలంలోనే లిక్కర్ షాప్ రూల్స్.. ఆ ఎస్ఐవి శివమణి ఫోజులా?

నియోజకవర్గం మొత్తం ఒకేలా ఉండాలి. కాని మిగితా ఆరు మండలాల్లో ఉదయం 10 గంటలకే వైన్ షాపులు ఓపెన్ అవుతుండగా.. మునుగోడు మండలంలోనే ఎందుకు ఈ రూల్ అనే ప్రశ్నలు వస్తున్నాయి.

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : ప్రచారం కొండంత.. చేసేది గోరంత.. ఈ సూక్తి మునుగోడుఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. తన నియోజకవర్గంలో బెల్టు షాపులు నడవడానికి వీలు లేదని గొప్పగా ప్రకటించుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు వైన్ షాప్ రూల్స్ కూడా మార్చేశారు. రాష్ట్రమంతా అబ్కారీ రూల్స్ ఒకలా ఉంటే.. అవి మునుగోడులో నడవబోమంటూ కొత్త రూల్ పెట్టారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని.. సాయంత్రం 5 గంటల తర్వాతే సిట్టింగ్ కు అనుమతి ఉంటుందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలకు ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. రాష్ట్రమంతా రాజగోపాల్ రెడ్డి గ్రేట్ అనే టాక్ వచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది. రాజగోపాల్ రెడ్డి రూల్స్ ఎక్కడా పాటించడం లేదు. వైన్ షాపు యజమానులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రమంతా ఉన్నట్లే ఉదయమే షాపులు తీసుకున్నారు. బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అయితే ఒక్క మండలంలోనే మాత్రం వైన్ షాపులకు మధ్యాహ్నం తర్వాతే తెరుచుకుంటున్నాయి.

Read More : భార్యా భర్తల విడాకుల పై హైకోర్టు కీలక తీర్పు..!

మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు, గట్టుపల్ల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలు ఉన్నయి. అయితే ఒక్క మునుగోడు మండలంలోనే వైన్ షాపులకు కోమటిరెడ్డి రూల్స్ వర్తిస్తున్నాయి. మిగితా ఆరు మండలాల్లో యథావిధిగా ఉదయం 10 గంటలకే వైన్ షాపులు తీస్తున్నారు. సిట్టింగ్ కూడా ఉదయం నుంచే ఉంటుంది. కాని మునుగోడు మండలంలో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు వైన్ షాపులు తెరవాలని కండీషన్ పెట్టారు ఎస్ఐ. సిట్టింగ్ కు కూడా సాయంత్రం 5 గంటల తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు జనాల్లో చర్చగా మారింది. నియోజకవర్గంలోని మిగితా 6 మండలాలకు లేని రూల్ ఒక్క మునుగోడు మండలానికే ఎందుకనే చర్చ సాగుతోంది. స్థానిక ఎస్ఐ ప్రచారం కోసం ఓవరాక్షన్ చేస్తున్నారనే టాక్ ప్రజల నుంచి వస్తోంది.

ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తున్నారు అనుకుంటే నియోజకవర్గం మొత్తం ఒకేలా ఉండాలి. కాని మిగితా ఆరు మండలాల్లో ఉదయం 10 గంటలకే వైన్ షాపులు ఓపెన్ అవుతుండగా.. మునుగోడు మండలంలోనే ఎందుకు ఈ రూల్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. అబ్కారీ రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటలకే షాపులు తెరుచుకోవచ్చు. అలా కుదరదని చెప్పడం చట్టపరంగా వీలుకాదు. కాదు కూడదు అంటే టెండర్ ద్వారా చట్టబద్దంగా షాపులు దక్కించుకున్న యజమానులు కోర్టుకు వెళితే వారికి అనుకూలంగానే తీర్పు రావడం ఖాయం. ఈ విషయం తెలుసు కాబట్టే వైన్ షాపులకు కండీషన్ల విషయంలో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారనే టాక్ వస్తోంది. అందుకే వైన్ షాపులు తాను చెప్పిన సమయానికి కాకుండా రెగ్యూలర్ టైంకే తీస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే మునుగోడు ఎస్ఐ మాత్రం శివమణిలో ఊహించుకుంటూ వైన్ షాపు యజమానులను బెదిరిస్తున్నారనే చర్చ జనాల్లో సాగుతోంది. ఎక్కడా లేని రూల్ ఇక్కడే ఎందుకు పెడుతున్నారని మందుబాబులు కూడా నిలదీస్తున్నారు.

Read More : గంజాయి మత్తులో వీరంగం.. ఇద్దరు మహిళలపై దారుణం (VIDEO)

మునుగోడు ఎస్ఐ తీరుపై మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. మండలంలో బెల్టుషాపులు కట్టడి చేస్తున్నానని ఎస్ఐ చెబుతున్నా.. చాలా గ్రామాల్లో దొంగచాటుగా అమ్ముతున్నారని చెబుతున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే బెల్టుషాపులు నడిపించేలా ఎస్ఐ చూస్తున్నారని అంటున్నారు. పైకి బెల్టుషాపులకు అనుమతి లేదని బెదిరిస్తూ… లోలోపల మాత్రం కొందరు బెల్టు షాపులు నడిపేలా ఎస్ఐ చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం వైన్ షాపులు, బెల్టుషాపుల విషయంలో మునుగోడు ఎస్ఐ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button