
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కొత్త లిక్కర్ షాపులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాల్టి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోనున్నామని అధికారులు తెలిపారు. ఆ తరువాత అక్టోబర్ 23వ తేదీన లక్కీ డ్రా తీసి షాపులను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఒక్క టెండర్ ఫీజు 3,00,000గా నిర్ణయించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం అప్లికేషన్ల ద్వారానే 400 కోట్ల వరకు ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2027 నవంబర్ వరకు కూడా లైసెన్స్ కాలపరిమితి తో షాపులు కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది కూడా సంపాదించుకున్న డబ్బంతా కూడా అన్ని లక్షల పెట్టి టెండర్ వేయడం అవసరమా?.. ఒకసారి దీని గురించి ఆలోచించాలని, ఈ వృధా చేసే సొమ్మునే మన ఇంటి ఖర్చులకు వాడుకుంటే సంసారం కూడా జీవితాంతం చాలా బాగుంటుందని అంటున్నారు. మరికొందరేమో ఈ జాబ్స్ ఇవి చేయడం కన్నా ఒక్కసారి ఈ లక్కీ డ్రా తగిలితే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది అని అంటున్నారు.
Read also : ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Read also : సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలి : MLA కోమటిరెడ్డి