
మునుగోడు, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం కల్పించేందుకు లయన్స్ క్లబ్ మునుగోడు శ్రేయోభిలాషి అడుగులు వేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల మునుగోడు ప్రాంగణంలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మొత్తం 8 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నారబోయిన రవి మాట్లాడుతూ, “విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు వాహన సౌకర్యం పెద్ద పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ సహాయం చిన్న ప్రయత్నమే అయినా, వారికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ పాలకూరి నర్సింహా, ట్రెజరర్ లయన్ మిర్యాల వెంకటేశం, 1వ వైస్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశ్వర్లు, 2వ వైస్ ప్రెసిడెంట్ అనంత స్వామి గౌడ్, సభ్యులు లయన్ మిర్యాల శ్రీనివాస్, లయన్ నారబోయిన సుధాకర్, లయన్ కుమార స్వామి, లయన్ మిర్యాల మధుకర్, లయన్ కొంగరి కృపానందం పాల్గొన్నారు.
పాఠశాల హెడ్‌మాస్టర్ అశోక్, ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, అంబటి సత్తయ్య తదితరులు కార్యక్రమ సమన్వయంలో కీలకపాత్ర పోషించారు. గ్రామస్థులు లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని హర్షిస్తూ సభ్యులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధుల కోసం ఇలాంటి ప్రోత్సాహక చర్యలు మరింతగా అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.