తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఒక జూ నుండి సింహం తప్పించుకొని నగరంలోకి ప్రవేశించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో నగర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజల ప్రభుత్వం గా ఉండాలంటూ వచ్చినటువంటి వార్తలు అన్నీ కూడా మనం చూశాం. అయితే తాజాగా ఈ వార్తలపై హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ RM దోబ్రియల్ స్పందించారు.
స్మితా సబర్వాల్ పై కమిషన్ సీరియస్!
జూ పార్క్ నుండి తప్పించుకున్న సింహం అంటూ నగరంలో ప్రవేశించిన వార్తలు అన్నీ కూడా అబద్ధమని చెప్పారు. అది ఒక ఫేక్ న్యూస్ అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అది ఒక సినిమా ప్రమోషన్ల లో భాగంగా సింహం పై అలా వార్తలు రాసుకుని ఉపయోగించుకున్నారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సింహం తప్పించుకుపోయిందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో నిజమే అనుకొని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇండియాను వీడనున్న కోహ్లీ!.. పూర్తిగా లండన్లోనే?
ఇక వెంటనే సింహం గురించి చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని మూవీ టీం ను ఫారెస్ట్ అధికారులు ఆదేశించారు అని హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ RM దోబ్రియల్ చెప్పుకొచ్చారు. కాగా సింహం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది కనుక ఒకసారి బయటకు వచ్చిందంటే ఏ ఒక్కరికి కూడా ప్రాణాలు మీద ఆశ ఉండదు. కాబట్టి ఒక్కసారిగా జూన్ నుండి ఇప్పుడు తప్పించుకుని నగరం వైపు వచ్చిందని అనగానే అందరూ కూడా భయపడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులలో ఒకరు అది ఒక ఫేక్ న్యూస్ అని చక్కటి శుభవార్త చెప్పారు. దీంతో అందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.