క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి : జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని దాన్ని చేజేతుల నాశనం చేసుకోవద్దని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి వాహనదారులకు సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం బిజెపి నాయకుడు గుర్రాల రాంభూపాల్ రెడ్డి పోలీసులకు, పాత్రికేయులకు, వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, ఎస్సై మాధవరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి పడే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, పోలీసులు స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.