
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మాంసాహారా వ్యాపారంలో కూడా చికెన్ షాపులకు లైసెన్సులు తీసుకురావాలనే ఆలోచనలు చేస్తుంది. చికెన్ వ్యాపారంలో ఈ మధ్య చాలానే అక్రమాలు బయటపడుతూ ఉన్నాయి.. ఈ సందర్భంగా నేడు చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైసెన్సింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోళ్లు ఏ ఫామ్ నుంచి వస్తున్నాయి?.. అలాగే షాప్ యజమాని ఎవరికి ఈ మాంసాన్ని అమ్ముతున్నారు?.. మొదలగు కొన్ని అంశాల గురించి ట్రాక్ చేసే విధంగా కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి లైసెన్స్ విధానంలో గుర్తింపు పొందిన షాపుల నుంచే వివిధ హోటళ్లకు చికెన్ సరఫరా అయ్యే విధంగా ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారు. వీటితోపాటుగా స్టెరాయిడ్లు వాడిన కోళ్ళ అమ్మకాలను నియంత్రించడంపై కూడా దృష్టి పెడుతున్నామని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ పేరుకుంది. ఈమధ్య రాష్ట్రంలో నిల్వ ఉంచిన చికెన్ మాంసాన్ని ప్రజలకు అమ్మడం వల్ల అనారోగ్యము పాలవుతున్నారు. దీని కారణంగా అధికారులు ఈ మాంసాహారపు వాటిపై ఆలోచన చేసి సరికొత్త లైసెన్స్ విధానాన్ని తీసుకురానున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ లైసెన్స్ విధానం ద్వారా చాలానే అక్రమాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. వీటిపై చాలామంది సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది చికెన్ షాప్ లోకి కూడా లైసెన్సులు ఏంటని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది లైసెన్స్ విధానం తీసుకువస్తేనే కొంతమంది నిబద్ధతతో నడుచుకుంటారని… మంచి మాంసం ప్రజలకు చేకూరుతుంది అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : నేడే విచారణ… నిర్ణయమా?.. లేక వాయిదానా?
Read also : చండూరు మున్సిపల్ మడిగలు ప్రవేటు వేలం…?