క్రైమ్తెలంగాణ

యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లో లైసెన్స్ దొంగలు..!?

సిసిఎస్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్, మనీ ఆర్డర్ ల మాదిరిగా, ఎవరి వాటా వారికి పంచుతాడని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..!? అతను చెప్పేది పెద్ద సారుకి వేధమని, జిల్లాలో జరిగిన ఏ దొంగతనం కేసులో అతనిని పిలవకపోయినా, కేసు చేదించినా, పెద్ద సారుతో మీకు కౌన్సిలింగ్ తప్పదనే విధంగా కటింగ్ ఇస్తున్నాడట అతగాడు..!

    • కోట్ల రూపాయల స్క్రాప్ ను మాయం చేసిన పోలీసులు, అధికారులు, సిబ్బంది..!?
    • దొంగలను పట్టుకున్న పోలీసులు, వాడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!?
    • రికవరీ కొండంతా, చూపింది పిడికెడంత.. తిలా పాపం తలా పిడికెడు…!?
    • ఇంటి మనుషులే దొంగతనం చేసి, వేరే వారిపై బదునాం..!?
    • జిల్లాలో అంతాతానై నడిపిస్తున్న ఓ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ..!?
    • ఆయన చుట్టే “గిరి” ప్రదక్షిణాలు చేస్తున్న కొన్ని కేసులు..!?
    • ఆయన చెప్పిందే పెద్ద సారుకు వేధమంటూ ప్రచారం..!?
    • థర్మల్ ప్లాంట్ పేరు మీద కోట్ల రూపాయల స్కామ్..ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా..?

నల్లగొండ జిల్లా ప్రత్యేక ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): యాదాద్రి ధర్మల్ ప్లాంట్ స్కామ్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి..!? తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతన్న శాస్త్రానికి ఏమాత్రం తేడా లేదంటున్నారు స్థానికులు..!? ఈ స్కామ్ ను పోలీసులు, అధికారులు అక్కడి సిబ్బందే చేసి, స్థానిక ప్రజలపై చిన్న చిన్న కేసులను మోపి, ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా చేశారని అనుకుంటున్నారు ప్రజలు..!? అవినీతిని అడ్డుకోవలసిన పోలీసులు సైతం, తమ సొంతంగా స్క్రాప్ ను లారీలలో లోడ్ చేసి బయట అమ్ముకున్నారని టాక్..!? ఈ అవినీతి దందాలో ముగ్గురు అధికారులతో పాటు, జిల్లా పెద్ద సార్ ల హస్తం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతుంది..!? ఈ నోటా ఆ నోటా ఈ కదంతా బయటికి పొక్కడంతో, స్థానికంగా ఉన్న గిరిజన ప్రజలపై నేరం మోపుతూ, అక్కడ పని చేసే చిన్నా చితక ఉద్యోగస్థుల పాత్రను కూడా అందులో జోడించారని అనుకుంటున్నారు..!? ఈ స్క్రాప్ ను కొనుగోలు చేసిన కొంతమంది వ్యక్తుల నుండి కోట్ల రూపాయలలో వసూలు చేసి, రికవరీలో మాత్రం తక్కువ చూపారంటు ఇప్పటికి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..!? ఇక మొత్తానికి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేసిన పోలీసులు, ఎవరి వాటా వారు తీసుకోని నోరు మెదపలేదని ప్రచారం..!? డిప్యూటీషన్ కింద డ్యూటీకి వెళ్ళిన కొంతమంది పోలీసులు గట్టిగానే వెనకేసుకున్నారని ప్రజలంటున్నారు..!?
ప్రభుత్వం ఈ అంశంపై కఠిన విచారణ చేస్తే అసలు దొంగలు ఇట్టే బయటపడుతారని నిపుణుల అభిప్రాయం..!?

ఇక ప్లాంట్ లో జరిగిన దొంగతనం కేసులో జిల్లా అధికారులకు, సంబంధిత బాధ్యత గల అధికారులకు సిసిఎస్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్, మనీ ఆర్డర్ ల మాదిరిగా, ఎవరి వాటా వారికి పంచుతాడని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..!? అతను చెప్పేది పెద్ద సారుకి వేధమని, జిల్లాలో జరిగిన ఏ దొంగతనం కేసులో అతనిని పిలవకపోయినా, కేసు చేదించినా, పెద్ద సారుతో మీకు కౌన్సిలింగ్ తప్పదనే విధంగా కటింగ్ ఇస్తున్నాడట అతగాడు..! ఇతగాడి చేష్టలకు వెంట పని చేసే సిబ్బంది, జిల్లాలోని వివిధ స్థాయి అధికారులు సైతం బెంబేలెత్తిపోతున్నారంటే ఆశ్చర్యమే అంటున్నారు విషయం తెలిసిన వారు..!? ఇతనితో పని చేసే సిబ్బంది, ఆ శాఖ అధికారులు సైతం జిల్లా అధికారికి ఇతని గురించి చెప్పలేక, అతని అక్రమాలు చూడలేకపోతున్నారంటే నమ్మలేని పరిస్థితి..!? ఒక వేల జిల్లా అధికారికి ఇతని గురించి చెబితే, ఇద్దరూ కలిసి వారిని దూర ప్రాంతాలకు బదిలీపై పంపిస్తారేమోనని అనుకుంటున్నారట..!?

ఇక దొంగతనం కేసులలో తులాల కొద్ది పసిడిని కాజేస్తాడని, మిర్యాలగూడ సబ్ డివిజన్ లో దొంగతనం కేసులలో, 60 తులాలు పట్టుకొని 25 తులాలు మాత్రమే రికవరీ ఇచ్చాడని, మిగితా వాటిని అప్పటి జిల్లా అధికారితో కలిసి మింగేసాడని, ఎవరికి చెప్పాలో అర్ధం కాక, ఆ డివిజన్ అధికారులు సైతం ముక్కున వెలేసుకున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.. 10 సంవత్సరాల నుండి ఒకే విభాగంలో ఉన్న ఈ ఉత్తముడెప్పుడూ, అక్రమాలే చేశాడని టాక్..!? జిల్లా అధికారికి నేను ఎంత చెబితే అంతని, ఆయనకు నేను నెలకు కొన్ని లక్షల రూపాయల మామూలు ఇప్పిస్తున్నానని, తన పోస్టింగ్ రాచకొండలో ఉండగా, తనను స్వయంగా జిల్లా అధికారే, నువ్వు నా దగ్గర పని చెయ్యాలని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడంటూ బహటంగానే చెప్పుకుంటున్నాడని ముచ్చట..!?

అతని శాఖలో పని చేసే ఉన్నత అధికారులను సైతం, అవినీతి బురదలో దింపుతూ, వారు మాట వినకుంటే వారికి పెద్ద సారుతో చెప్పి, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులు సైతం లోలోపల కుమిలిపోతున్నారని పలువురు అంటున్నారు…!? తాను చెప్పిన వారికే బంతి భోజనమనే విధంగా, జిల్లాలో చక్రం తిప్పుతున్నాడని, అతను పని చేసే శాఖలోని పై అధికారులను సైతం లెక్క చేయకుండా తాను చెప్పింది మాత్రమే చేయాలని, ఆ అధికారులకు సైతం ఆర్డర్ వేస్తాడట ఇతగాడు…!? కొంత మంది అధికారులు ఐతే మేము ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని, ఇక్కడ మండల, సర్కిల్, డివిజన్ స్థాయిలో పేరు సంపాదించుకుందామంటే, ఈ హెడ్ కానిస్టేబుల్ లాంటి వారు, అక్రమ సంపాదన మార్గంలోకి యువ అధికారులను సైతం లాగుతున్నాడని, ఇలా ఐతే కొత్తగా పోలీస్ శాఖలో చేరిన యువ అధికారులు ఏమైలోతారంటూ కొంతమంది అధికారుల ఆవేదనట..!?

నల్గొండ జిల్లాలో ఇన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నా, జిల్లా అధికారులే వారి వెన్నెంటే ఉండడం, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ లాంటి వారిని, పెంచి పోషించడం వలన, పోలీస్ వ్యవస్థపై ప్రజలకి నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని నిపుణుల అభిప్రాయం…!?

ఇక ధర్మల్ ప్లాంట్ బాగోతం తెలుసుకున్న ఉన్నత అధికారులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది..!? ఈ కోట్ల రూపాయల స్క్రాప్ వెనుక దాగి ఉన్న ముసుగు దొంగలపై, అంతా తానైన సిసియస్ హెడ్ కానిస్టేబుల్ గురించి మరో వివరణాత్మకమైన కధనంతో మీ ముందుకు..

కామినేని కధాగానం, ఆవుల ఆర్తనాధాలు, పిడిఎస్ పారాయణంతో పాటు, ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ, మిర్యాలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ “వీర” గాధలపై రానున్న వరుస కథనాల ద్వారా మీ ముందుకు…

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button