
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా ఒక వీడియో ఇదే సోషల్ మీడియాలో అందరి మనసులను కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి. రెండు నుంచి మూడు ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు తమ ఇంటికి వెలతామని, బాగా ఆకలేస్తుంది అంటూ టీచర్ని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాకు పాలు కావాలి.. మమ్మీ దగ్గరికి పంపించండి అని ఇద్దరు పిల్లలు టీచర్ ను రిక్వెస్ట్ చేస్తుండగా వీడియో తీశారు. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే వేగంగా వైరల్ అవుతూ వెళ్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి నెటిజన్ కూడా రెండు మూడు ఏళ్ల వయసులోనే పిల్లలను బడికి పంపడం మంచిది కాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుత రోజుల్లో ప్లే స్కూల్, నర్సరీ మరియు కిండర్ గార్టెన్ అంటూ వేల ఫీజులు దొబ్బడమే కాకుండా.. ఇందులో కేవలం రెండు మూడు సంవత్సరాల పిల్లలకు ఏం అర్థం అవుతుంది అని.. చక్కగా అమ్మ ఒడిలో ఉండాల్సిన పిల్లలు ఇలా నాలుగు గోడల మధ్య ఉంచాల్సిన అవసరం లేదు అని విమర్శిస్తున్నారు. బాల్యం చాలా అమూల్యమైందే కానీ .. పిల్లలు రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి స్కూల్స్ అవసరం లేదని చక్కగా తల్లిదండ్రుల వద్ద గడప వలసిందిగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read also : యువత క్రీడల్లో రాణించాలి : ఎస్సై ఇరుగు రవి కుమార్
Read also : Dog Row: పార్లమెంట్ లో ‘కుక్క’ పంచాయితీ, రేణుకా చౌదరి కొత్త వివాదం!





