
నారాయణపేట జిల్లా, క్రైమ్ మిర్రర్:-
నారాయణపేట జిల్లా, మద్దూరు మండల పరిధిలోని పెదిరుపహాడ్ గ్రామంలో తాండ దగ్గర గుట్టల్లో చిరుతపులులు సంచారం చేస్తున్నాయని తాండావాసులు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు తెలియచేసిన పట్టించుకోలేదని తాండవాసులు తెలియజేశారు. సోమవారం రోజు సడన్ గా గుట్టల పైన చిరుతపులులు దర్శనం ఇవ్వడంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తులు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంటున్నామని అన్నారు. సోమవారం రోజు సాయంత్రం ఫారెస్ట్ అధికారులు తండాకు చేరుకొని పరిశీలిస్తున్నామని గ్రామస్తులకు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు గ్రామస్తులు బయటకు రావద్దని ప్రజలకు విన్నపించారు. గ్రామస్తులు తండావాసులు ఎవరు దయచేసి రాత్రిపూట బయటకు రావద్దని అన్నారు. మంగళవారం రోజు సీసీ కెమెరాలు,బోనులు తీసుకొని వస్తామని గ్రామస్తులకు తెలియజేశారు. త్వరలోనే చిరుత పులులను పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారి తెలియజేశారు.

Read also : సంక్రాంతికి ఊరెళ్ళాలనుకుంటున్నారా?.. ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి!
Read also : టీనేజర్లకు సోషల్ మీడియా బంద్.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం?





