
కోదాడ, క్రైమ్ మిర్రర్:- కోదాడ పోలీస్ సబ్ డివిజన్ లోని కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట పరిధిలో శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లా యస్ పి శ్రీ కె.నర్సింహా IPS గారు ఈ విషయాల్లో ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుండి అక్రమంగా ఇసుక లారీలలో గాని ట్రాక్టర్లలో గాని తరలిస్తే ఆయా వాహనాలను సీజ్ చేసి అటు మైనింగ్ మరియు ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల ద్వారా తనిఖీ చేపించి, ఆ తర్వాత కోర్టుకు పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది నకిలీ వే బిల్లులు సృష్టించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని.. ఇప్పటికే కొంతమంది పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది మరియు వారి వాహనాలను కూడా సీట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా పేకాట లేదా ఇతర జూద క్రీడలు ఎవరైనా నిర్వహించిన లేదా ఆడినా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని కోర్టు కేసులతో పాటు మళ్ళీ అటువంటి నేరాలు చేయకుండా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎవరైనా పశువులను కబేలాలకు తరలించేందుకు అక్రమంగా రవాణా చేసే వారిపై లేదా వారికి సహకరించే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతుల వ్యవసాయం పేరుతో కొంతమంది ఇటువంటి దందా చేసే వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇక పై కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందిదని.. గంజాయి, పేకాట, పశువుల అక్రమ రవాణా మరియు ఇసుక అక్రమ రవాణా విషయాల్లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇట్టి విషయాల్లో ఎవరైనా పోలీస్ లేదా ఇతర శాఖల సిబ్బంది గానీ ఉన్నట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గట్టి నిఘా ఏర్పాటు చేసి వీటిని పూర్తిస్థాయిలో అడ్డుకొని అక్రమార్కులపై ఉక్కు పాదం ఇవ్వడం జరుగుతుందని. ఎవరైనా గంజాయి, పేకాట, పశువుల అక్రమ రవాణా లేదా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమ వ్యవహారాలు చేస్తున్నట్లయితే మా దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరుచున్నాము. దీని కొరకు నా ఆఫీసులో ప్రత్యేకమైన నంబర్ ( 8790207855 ) కూడా ఏర్పాటు చేశామని. ప్రజలు ఎవరైనా ఈ నెంబర్ 8790207855 కు లేదా సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712686057 ఎస్ఎంఎస్
వాట్సప్ ద్వారా లేదా డయల్ 100 కాల్ చేయడం ద్వారా కానీ సమాచారాన్నిఇవ్వవలసిందిగా
ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read also : ఏపీలో మళ్లీ కూటమే గెలుస్తుంది.. మళ్లీ మోడీ నే PM అవుతారు : సీఎం