
క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్:-
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆసిఫ్ కబాజ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు మా దేశంను విడిచి వెళ్లాలని చెప్పుకొచ్చారు. మా ఈ దేశం, మా సౌకర్యాలు కేవలం మా 25 కోట్ల మంది పాకిస్తాన్ జనానికే సొంతమని కీలక ప్రకటన చేశారు. కాబట్టి ఇక్కడ ఉంటున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు తిరిగి మీ దేశానికి వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కు మీ దేశంలో ప్రత్యేక ప్రభుత్వము ఉంది కాబట్టి తక్షణమే వెళ్ళిపోండి అంటూ పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల ఉద్రిక్తల విషయంలో ఒకవైపు ఆఫ్గనిస్తాన్ మరోవైపు భారత్ తో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపుతుంది. కాగా ఇప్పటికే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా ఉద్రిక్తత పరిస్థితులను ఏర్పరచుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తిగా మద్దతుగా నిలిచింది. దీంతో ఇరుదేశాల మధ్య హోరాహోరీగా ప్రస్తుతానికి సోషల్ మీడియా వార్ నడుస్తుంది. మరోవైపు నేడు పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడులలో ఆఫ్ఘనిస్తానికి చెందినటువంటి ముగ్గురు క్రికెటర్లు మృతి చెందినట్లుగా సమాచారం.
Read also : పాక్ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి.. పిరికిపంద చర్యగా భావిస్తున్నాం!
Read also : సాయంత్రం 5 గంటలకు గ్రూప్ 2 నియామక పత్రాలు పంపిణీ!