
చండూరు, క్రైమ్ మిర్రర్:-ఈనెల 27న ఎలక్క తుర్తి లో జరిగే బిఆర్ఎస్ బహిరంగస్థలాన్ని ఆదివారం మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి వెళ్లి సందర్శించారు. బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు అభిమానులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలను,కార్యకర్తలను వారు కోరారు. సందర్శించిన వారిలో
రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న , మాజీ జెడ్పిటిసి అన్నపర్తి సంతోష్ శేఖర్, యువజన విభాగం అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావ్, బొడ్డు సతీష్, నక్క సుధీర్ తదితరులు పాల్గొన్నారు.