
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బిఆర్ఎస్ మరియు బీజేపీలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతస్థాయిలో పాల్గొంటున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మా పార్టీనే గెలుస్తుందని ప్రతి ఒక్క పార్టీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక షాకింగ్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయ అవకాశాలు ఉన్నాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. దాదాపు ఈ లోకపోల్ సర్వే 3100 మందిపై సర్వే చేయగా 44 శాతం మంది కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నారు అన్నట్లుగా పేర్కొన్నారు. ఇక ముఖ్య ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీకి 15 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక మరోవైపు బిజెపికి 15%, ఇతరులకు 3 శాతం మంది అనుకూలంగా ప్రభావం చూపుతున్నారు అని ఈ లోక్ పోల్ సర్వే వెల్లడించింది. ఇంకోపక్క కేకే సర్వేలో భాగంగా బీఆర్ఎస్ విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ప్రతి ఏరియాల వారీగా చేపట్టినటువంటి ఈ సర్వేలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కంటే బిఆర్ఎస్ పార్టీకే 12 నుంచి 13 శాతం వరకు మెజార్టీ వచ్చింది అని తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ సర్వే నిజమవుతుందో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత బరిలో దిగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయం.. ఇదే హైడ్రా తీరు : కేటీఆర్
Read also : తుఫాన్, తొక్కిసలాట ఘటనను పక్కద్రోవ పట్టించడానికే అరెస్టు చేశారు : జగన్





