క్రైమ్తెలంగాణ

నల్గొండ పట్టణంలో అర్థరాత్రి పకడ్బందీగా ఆపరేషన్ చబుత్ర

  • అర్థరాత్రి ఆవారాగా తిరుగుతున్న 84 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
  • 48 బైకులు,5 కార్లు, 3 ఆటో లు, 80 సెల్ఫోన్లు స్వాధీనం*
  • 24 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు

నల్గొండ,క్రైమ్ మిర్రర్: మంగళవారం అర్థరాత్రి నల్గొండ పట్టణం లో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో వన్ టౌన్, టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు సిఐలు 12 మంది ఎస్సైలు, 80 మంది కానిస్టేబుల్ మొత్తం 10 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 84 మందిని అదుపులోకి తీసుకొని డిఎస్పీ గారు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 48 బైకులు, 5 కార్లు, 3 ఆటో లు, 80 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 24 మంది పై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనుండి అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఇకనుండి రెగ్యులర్గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది.

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

నల్లగొండ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

రాత్రి పట్టుబడిన వారందరినీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని టిటిఐ సెంటర్ నందు వారి తల్లిదండ్రుల సమక్షంలో, అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఆవారాగా తిరగడం, తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టాల గురించి మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

కార్యక్రమంలో సిఐలు రాజశేఖర్ రెడ్డి, డానియల్, రాజు, సైదులు, కొండల్ రెడ్డి మరియు ఎస్ఐ లు నాగరాజు, సైదులు, సురేష్, సైదా బాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button