హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్): నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన బారి వర్షం మల్కాజిగిరి ప్రాంతంలో కలకలం రేపింది. గౌతమ్‌నగర్‌లో ఉన్న ఒక కొండచరియ వర్షపు నీటితో కూలి జీహెచ్‌ఎంసీ (GHMC) వాహనంపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.
స్థానికుల సమాచారం మేరకు, గౌతమ్‌నగర్‌లోని కొండ ప్రక్కన పార్క్ చేసి ఉంచిన GHMC మలినాల రవాణా వాహనం పైకి భారీ రాళ్లు, మట్టి జారిపడ్డాయి. కొండచరియల బరువుతో వాహనం కొంతమేరకు దెబ్బతిన్నా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read:నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
వెంటనే సమాచారం అందుకున్న మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు, GHMC విభాగ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కొండప్రాంతాన్ని సర్వే చేశారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, మరిన్ని రాళ్లు జారిపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
స్థానికులు తెలిపినట్లుగా, గౌతమ్‌నగర్‌లోని ఈ కొండప్రాంతం ప్రతిసారీ వర్షాకాలంలో ప్రమాదానికి గురవుతుంటుందని, ఇప్పటికైనా GHMC శాశ్వత రక్షణ గోడలు నిర్మించాలి అని కోరుతున్నారు.
Also Read:జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం





