Wednesday, March 4, 2026
Homeక్రైమ్సర్వే నెంబర్ మాయ చేసి భూకబ్జా: రంగారెడ్డి జిల్లా విలేఖరి కుంభకోణం!

సర్వే నెంబర్ మాయ చేసి భూకబ్జా: రంగారెడ్డి జిల్లా విలేఖరి కుంభకోణం!

  • నకిలీ స్టాంపుల దందా వెలుగులోకి వస్తుందా? పోలీసుల దృష్టికి ప్రజల డిమాండ్

రంగారెడ్డి జిల్లా బ్యూరో, క్రైమ్ మిర్రర్ : హయత్ నగర్ నుండి తొర్రూరు వెళ్లే రహదారిపై ఓ విలేఖరి సర్వే నెంబర్‌ను మార్ఫింగ్ చేసి సుమారు 600 గజాల నుండి 1000 గజాల మధ్య స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంలో నకిలీ స్టాంపులు, ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉపయోగించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూ కుంభకోణాన్ని పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే, ఇప్పటివరకు కలుగుల్లో దాక్కున్న ‘ఎలుకలు’ అన్నీ బయటపడతాయని, హయత్ నగర్ పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో “పొడుగు పొడుగు” అనుకుని పోటుగాళ్లుగా మారిన భూదందాగాళ్ల ముఠా బహిరంగమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారుల మౌనమే ముఠాలకు వెన్నుదన్ను..?

స్థలానికి సంబంధించిన అసలు సర్వే నెంబర్‌తో సంబంధం లేని రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయో ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. దీనిపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలు గట్టి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments