
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేడు విషాదం నెలకొంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొండా లక్ష్మారెడ్డి నేడు ఉదయం ఐదున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. లక్ష్మారెడ్డి మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు అలాగే ప్రముఖ వ్యక్తులు అతనికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే గాను అలాగే న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా పలు గుర్తింపులు తెచ్చుకున్నటువంటి కొండా లక్ష్మారెడ్డి కొద్దిరోజుల నుంచి అనారోగ్య బారినపడి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ తరుణంలోనే కుటుంబ సభ్యులు కొండా లక్ష్మారెడ్డి ని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. నేడు చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. జర్నలిజం పట్ల ఎక్కువ మక్కువ ఉన్నటువంటి ఇతను 1980 సంవత్సరంలో ఎన్ ఎస్ ఎస్ ను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయ మొత్తం కూడా ముడిపడి ఉంది. ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొండా వెంకట రంగారెడ్డి మనవడు. ఈయన మొట్టమొదటిసారిగా 1999 అలాగే 2014లో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇతని మరణ వార్తను తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు ఇప్పటికే లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు.
Read also : ఇకపై నేరుగా అభిమానులను కలుస్తా.. అల్లు అర్జున్ కీలక నిర్ణయం!
Read also : అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం.. లబోదిబో మంటున్న రైతన్నలు