
క్రైమ్ మిర్రర్, కర్నూల్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నేడు తెల్లవారుజామున కాలి బూడిదైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం, చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారుజామున కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొన్న సందర్భంలో వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మొదటగా బస్సు ముందు భాగం మాత్రమే మంటలు చల రేగగా ఆ తర్వాత పూర్తిగా బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో బస్సులో ఏకంగా 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో 12 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు దూకగా వారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఇక మిగతావారు దాదాపు బస్సులో ఉండి పోయినట్లు సమాచారం అయితే సోషల్ మీడియాలో వైరల్అవుతుంది.
Read also :PKL 12… టాప్ 4 లో తెలుగు టైటాన్స్!
బస్సు దగ్ధం ఘటనపై కర్నూల్ కలెక్టర్ వివరణ..
అయితే తాజాగా ఈ ఘటనపై కర్నూలు కలెక్టర్ మాట్లాడుతూ.. బస్సులో మొత్తంగా 41 మంది ఉన్నారు అని.. 21 మంది సురక్షితంగా బయటపడ్డారు అని… కొంతమంది మృతదేహాలను వెలికి తీశామని చెప్పుకొచ్చారు. ఇక మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు,మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి కారణాలు
కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టగానే బస్సు డ్రైవర్ ఆపకుండా కొంత దూరం నెట్టుకెళ్లడంతో… బైక్ పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు చెప్పారు. మరోవైపు మంటలను ఫైర్ సేఫ్టీ కిట్ తో ఆపకుండా నీళ్లతో ఆపే ప్రయత్నంతో మంటలు వ్యాప్తిని ఎవరు కూడా అడ్డుకోలేక పోయారు. మరోవైపు లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండడంతో భారీగా మంటలు వ్యాపించాయని అర్థమవుతుంది. అందులోనూ రాత్రి సమయం, అద్దాలకు పొగ కమ్మేయడంతో ఏమీ అర్థం కాక బయటకు రాలేకపోవడం.
మరోవైపు ప్రమాదం జరిగినటువంటి బస్సు పై భారీగా జరిమాణాలు ఉన్నాయని తాజాగా అధికారులు తెలిపారు. ఇటీవల ఈ బస్సు పై ఓవర్ స్పీడ్ అలాగే డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదు అయ్యాయని అన్నారు. ఈ బస్సు పై మొత్తం 23 వేల రూపాయల వరకు ఫైన్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ కావేరీ సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నదానికి జరిమానాలే నిదర్శనం అని స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : PKL 12… టాప్ 4 లో తెలుగు టైటాన్స్!





