
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నేడు తెల్లవారుజామున కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 41 మంది ఉండగా అందులో 20 మంది మరణించినట్లుగా సమాచారం అందింది. మరో 12 మంది ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకేయగా… మిగిలిన వారి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొనడం ద్వారా మంటలు వ్యాపించి పలువురు నిద్రలోనే సజీవ దహనం అయిన సందర్భం చూశాం. మృతుల వివరాలపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు.
Read also : రెండో వన్డేలోనూ ఓడిన భారత్… అసలు లోపాలు ఇవే?
తాజాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ మంత్రి పన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటన పై స్పందిస్తూ ట్రావెల్స్ యజమానులకు హెచ్చరికలు చేశారు. బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించుకుంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్లను తీవ్రంగా హెచ్చరించారు. బస్సులు తనిఖీలు చేస్తేనేమో వేధింపులు అని యజమానులు మాపై మండిపడుతున్నారని… అవి వేధింపులు కావు అని.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని ప్రభుత్వం వీటిపై యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లకు కచ్చితంగా క్లాస్ తీసుకుంటామని తెలిపారు. కాగా ఇప్పటికే ఈ ఘటనపై స్పందిస్తూ పీఎం ఎక్స్గ్రేషియా ప్రకటించారు.మరో వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చనిపోయిన వారికి ఐదు లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు ప్రకటించారు.
Read also : తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ వర్షాలు..





