తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా కులగణన సర్వే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. పండుగ నుండి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత పొందాలంటే ఇటీవల నిర్వహించిన కుల గణన డేటా పరిశీలించాకే అర్హత ఉన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
ఇక రాబోయే రోజుల్లో కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులను ఇస్తామని అన్నారు. కావున వీటి వల్ల ఏకంగా 36 లక్షల మందికి లబ్ధి చేరుకుతుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డులు మరియు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. కావున త్వరలోనే సంక్రాంతి కానుకగా వీటన్నిటిని కూడా పరిశీలించి తొందరగా కుల గణన డేటా ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని తెలియజేశారు.
కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
కాగా రాష్ట్రవ్యాప్తంగా పోయిన నెలలో కులగణన సర్వే చేపట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కులగణన చేసే సమయంలో చాలా మంది చాలా రకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా తాజాగా వీటిని బేస్ చేసుకుని కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు.