క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: ఇటీవల తెలంగాణ జాగృతి నాయకురాలిగా కవిత ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన ‘జన జాగృతి’ పర్యటన లో బీఆర్‌ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులు లేరని, కేవలం బీటీ (బైక్ టు) బ్యాచ్ మాత్రమే ఉందని,ఉద్యమకారుడు శంబీపూర్ రాజుకు మంత్రి పదవి రావాల్సి ఉండగా బీటీ బ్యాచ్ వారికి మంత్రి పదవులు వచ్చాయని కవిత పరోక్షంగా విమర్శించారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. అవినీతి, భూ కబ్జాలు వంటి అంశాలపై ఆమె సెటైర్లు వేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
“కవిత కుక్క పేరు కూడా విస్కీ” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూసాను, నీకు ఎవడు భయపడతాడు,నీ అక్రమాలు, నీ మొగుడి అక్రమాలు బయటకు తీస్తే తట్టుకోగలవా? మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికి తెలుసు,
నీ అత్త గారి ఊర్లో నీకు గెలవడం చేతకాలేదు కేటీఆర్, హరీష్ రావులను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్న సంగతి మాకు తెల్వదు అనుకున్నావా? గల్లీ నుండి ఢిల్లీ వరకు నీ అక్రమాలు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు? అని ఘాటుగా మాధవరం కృష్ణారావు కవిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మరియు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారాన్ని సృష్టించాయి.





