తెలంగాణ

కేటీఆర్ పాదయాత్ర… ఆంధ్రావాలా బాటలో నడుస్తున్నాడా?

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎలక్షన్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం చాలా అవసరమని.. అందుకోసం ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా నా పాదయాత్ర కొనసాగుతుందని తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న సూర్యాపేటలో పర్యటించిన కేటీఆర్ మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. మనకి ఆ రోజుకి… ఈరోజుకి ఉద్యమాలు చేయడం అనేది కొత్త ఎం కాదు… అధికారం ఏం కొత్త కాదు అని… అలాగే ప్రతిపక్ష పాత్ర కూడా కొత్తేం కాదని అన్నారు. నేను మరియు జగదీష్ రెడ్డి 10 ఏళ్లు మంత్రిగా పనిచేశాం అని చెప్పుకొచ్చారు.

కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

అంతేకాకుండా ఇక్కడున్న వారిలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పదవులు అనేవి వచ్చాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పోరాటం లేదు. ప్రజల అవసరాల కోసం,ప్రజల కోసం మాత్రమే పోరాడుతుందని తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా నారా లోకేష్ పాదయాత్రను చేసి విజయాలను సాధించారు. మరి ఇప్పుడు అచ్చం అలానే కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తున్నడంతో గెలుపు ఖాయమని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

సై అంటే సై అంటున్న రసమయి, కవ్వంపల్లి – లడాయి ఎందుకో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button