
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ మారిన కూడా తమ పార్టీలో ఉన్నామంటూ ఎమ్మెల్యేల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపినర్ల జాబితాలో ఉండడం ఏంటని కేటీఆర్ ఆగ్రహిస్తూ ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నావని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అసలు వాళ్లకి బుద్ధుందా?.. సిగ్గుందా?.. అని తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ అని… ఈ పార్టీకి ఖర్గే మరియు రాహుల్ గాంధీ ముఖ్య నాయకులు అని ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖాన సందర్శన సందర్భంగా కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అలాగే కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుర్తించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వైరాలు మరింత పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మొదటి ఎదురు దెబ్బ తగులుతుంది అని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రమంతటా కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రతి వాడ తిరుగుతున్నారు. దీంతో ప్రతి పార్టీకి ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్ని చాలా కీలకము కానుంది.
Read also : జనజీవన స్రవంతిలో కలవండి: మావోయిస్టులకు రేవంత్ పిలుపు
Read also :శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : సీఎం