
తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వ, సచివాలయ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీ విరమణ చేయనున్నారు. దాంతో కొత్త సీఎస్ ఎంపికలో సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటి వరకు వినిపించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్ల స్థానంలో కొత్త వారి పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు, అధిక కాలం సర్వీసు అంశాలను కాంగ్రెస్ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ సీఎస్ రేసులో 1991 బ్యాచ్ కు చెందిన కె.రామకృష్ణారావు మొదటి నుంచి వినిపిస్తోంది. ఈయన ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా రాకృష్ణారావే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ లో శాంతికుమారి తర్వాతే ఆయనే సీనియర్. అయితే రామకృష్ణారావు విషయంలో కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ తో పదేళ్లు అత్యంత సన్నిహితంగా ఉన్నారు రామకృష్ణారావు. కేసీఆర్ పదేళ్ల కాలంలో తీసుకొచ్చిన అప్పులకు మూలకర్త కూడా అయనే. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ చేసిన అప్పుల గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు తేవడంలో కీలకంగా వ్యవహరించిన రామకృష్ణారావునే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే.. జనంలోకి తమపై తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆందోళనలో రేవంత్ ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు రామకృష్ణారావు. నాలుగు నెలలకు మించి కొనసాగే పరిస్థితి లేదు.
Also Read : హీరోయిన్ కు తెలంగాణ మంత్రి ధమ్కీ.. ఇల్లు ఇచ్చేయాలని వార్నింగ్
దీంతో తెలంగాణ సీఎస్ రేసులో మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు గతంలో కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగి జయేష్ రంజన్, మరొకరు వికాస్ రాజ్… ఇద్దరూ 1992 బ్యాచ్ అధికారులే. పెట్టుబడుల సాధనలో జయేష్ రంజన్ నైపుణ్యం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించిన వికాస్ రాజ్ ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే జయేష్ రంజన్ కు ఉన్నంత చాకచక్య లక్షణాలు వికాస్ రాజ్ కు లేవని అంటున్నారు. దాంతో జయేష్ రంజన్ కొత్త సీఎస్ గా దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!