క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పెట్టించిన లొట్ట పీస్ కేసులకు నేను భయపడను అని కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసులు ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడిస్తున్న హైడ్రా మరియు లగచర్ల బాధితులతో పోలిస్తే మనది పెద్ద ఇబ్బందా అంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణలోనూ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం?
తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి పోరాడినప్పుడు పడ్డ బాధలు కన్నా ఇదేం పెద్ద బాధ కాదని తెలిపారు. పార్టీ పెట్టినప్పుడు ఎన్నో విధాలుగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల కంటే ఇవేం పెద్దవి కావన్నారు. కచ్చితంగా మనం రైతు సమస్యలపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై పోరాడుతూనే ఉండాలని కోరారు. ఎలక్షన్స్ సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక పోవడమే కాకుండా ప్రజలను నిండా ముంచారని అన్నారు. ప్రజలకు ఇస్తానన్న రైతు భరోసా మరియు రుణమాఫీ ఫై మనం పోరాడి నిలదీయాల్సిందే అని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలకు నాగార్జునసాగర్ జీవనాడి!..
అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో పోరాడుతున్నటువంటి విద్యార్థులను వీపు విమానమోతలు మోగించారని, విద్యార్థులనే కనికరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అల్లర్లు సృష్టిస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి పెట్టేటువంటి కేసులకు ఇక్కడ ఎవరూ భయపడరు అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు మరియు కార్యకర్తలకు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేసేటువంటి మోసపు హామీలకు ఏదో ఒకరోజు ప్రజలే బుద్ధి చెప్పాలని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అంటూ, కాబట్టి ప్రజలకు అన్యాయం జరిగిన చోట పార్టీ కార్యకర్తలు నిలబడి ప్రజలకు ధైర్యం నింపాలని కోరారు.