తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. అధికారంలో ఉన్నామంటూ ఏది పడితే అది చేస్తే సాగుతుందని అనుకుంటున్నారా అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేయాల్సింది పోయి కావాలనే చాలామందిపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ
కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు మరియు అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్ లు, బూతులు, లూటీలు, కేసులు, అక్రమంగా అరెస్టులు ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.
అసదుద్దీన్ ఒవైసీ ఎంపీ పదవికి గండం!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారని తెలియజేశారు. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలి కానీ అధికారంలో ఉన్నాం కదా అని ప్రతి ఒక్కరిపై కక్ష సాధింపులు చేయకండి అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు రాజకీయాల పరంగా వైరాలనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
అల్లు అర్జున్ కు షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. అరెస్ట్ ఖాయమా?