తెలంగాణ

కేటీఆర్ బామ్మర్ది ఫోన్ సీజ్.. ఫాంహౌజ్ కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణలో సంచలనంగా మారిన జన్వాడ ఫాంహౌజ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను పోలీసులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం 12 గంటలకు తన లాయర్ తో కలిసి మోకిల్ల పోలీస్ స్టేషన్ కు వచ్చారు రాజ్ పాకాల. జన్వాడ ఫాంహౌజ్ కేసులో జరిగిన పార్టీకి సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారు మోకిల్ల పోలీసులు. 26 ప్రశ్నలు పోలీసులు సంధించారు.

మరింత సమాచారం రాబట్టడం కోసం రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌజ్‌కు తరలించారు.రాజ్‌పాకాలను తీసుకెళ్లి అతడి ఫామ్‌ హౌస్‌లో సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే వారి అక్కడ ఏమీ లభించలేదని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌కు తిరిగి తీసుకొచ్చి మరోసారి విచారించారు.విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగానే రాజ్ పాకాలను పోలీసులు ప్రశ్నించారు. విజయ్ మద్దూరికి పార్టీలో కొకైన్ పాజిటివ్ వచ్చింది. దీంతో కొకైన్ ఎలా వచ్చింది అన్న అంశంపై ప్రశ్నించారు పోలీసులు. విదేశీ మద్యం బాటిళ్లకు సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించారు పోలీసులు. విజయ్ మద్దూరి ఎక్కడ ఉన్నాడని ఆరా తీశారు పోలీసులు.

కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాల మొబైల్ ఫోన్‌ ను పోలీసులు సీజ్ చేశారు. రాజ్‌ పాకాల విచారణ పూర్తైందని పోలీసులు ప్రకటించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు తాను పోలీసులకు సహకరించానని రాజ్ పాకాల మీడియాతో చెప్పారు. ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. పోలీస్ అడిగినా ప్రశ్నలకు సమాదానాలు చెప్పానని తెలిపారు. మా ఫాం హౌస్ లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మరోసారి స్పష్టం చేశారు. విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఎవరికో పాజిటివ్ వస్తే తనకేంటీ సంబంధమని అన్నారు. మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది ..ఫ్యామిలీ పార్టీ చేసుకో కూడదా అని ప్రశ్నించారు. కావాలనే ఇష్యూను పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న విజయ్ మద్దూరి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.విజయ్ మద్దూరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు పోలీసులకు వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button