తెలంగాణ

బ్రేకింగ్ న్యూస్!… బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్

కెసిఆర్ తనయుడు, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తాజాగా అరెస్టు అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలోనే అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీ భవనం ఎదుట సీఎం రేవంత్ మరియు అదాని దోస్తీ టీ షర్టులతో నిరసన తెలుపుతున్న కేటీఆర్ ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారని బి ఆర్ ఎస్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున నేతలు అందరూ కూడా చర్చిస్తున్నారు.

Read More : టాలీవుడ్ ట్రెండింగ్ లో సీక్వెల్ సినిమాలు!.. ఎందుకో తెలుసా?

ఇవాళ అదానీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను ముద్రించిన టీషర్ట్లు ధరించి కేటీఆర్ మరియు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో అసెంబ్లీ గేటు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక అరెస్టు సమయంలో కేసీఆర్ ను పోలీసులు దౌర్జన్యంగా లాక్కొని మరి పోలీస్ వ్యాన్ లోకి తీసుకెళ్లారు. ఇక ఆ సమయంలోనే కేటీఆర్ కొన్ని నినాదాలు కూడా చేశారు. “ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం” అంటూ పెద్ద ఎత్తున కేటీఆర్ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More : ఒక మామూలు మనిషిలా శబరిమలలో టాలీవుడ్ హీరో?

ఈ నిరసనలో భాగంగా మొదటగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తరువాత కేటీఆర్ తో సహా అందరిని కూడా అరెస్టు చేశారు. ఇక అరెస్టు చేసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మరో పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కేటీఆర్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button