
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే రెండవ వన్డే మ్యాచ్ లో 80కు పైగా పరుగులు ఇవ్వడం పై అసంతృప్తిగా ఉన్నటువంటి అభిమానులకు మూడవ వన్డే లో కూడా ఎంపిక చేయడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్లో కూడా రెండు ఓవర్లు వేసిన ప్రసిద్ధి కృష్ణ ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకవైపు హర్షిత్ రానా అలాగే హర్షదీప్ సింగ్ ఇద్దరూ కూడా డాట్ బాల్స్ వేస్తూ అద్భుతంగా బౌలింగ్ వేస్తుండగా ప్రసిద్ధి కృష్ణ మాత్రం దారుణంగా పరుగులు ఇస్తున్నారు. దీంతో అతనిని పక్కన పెట్టి తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు బౌలింగ్ వేసే అవకాశం ఇచ్చారు. ఇక మహమ్మద్ షమీ మరియు సిరాజు లాంటి స్టార్ బౌలర్లను పక్కనపెట్టి మరి ఇలాంటి వారిని ఆడిస్తే మ్యాచ్ లు ఎలా గెలుస్తారు అంటూ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈరోజు వైజాగ్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా అద్భుతంగా రానిస్తుంది. ఇప్పటికే 25 ఓవర్లు జరగక 150 పరుగుల వరకు చేరుకుంది. ఈరోజు ఎవరు గెలిస్తే వారికే వన్డే సిరీస్ దక్కుతుంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయండి.
Read also : Ghost Dreams: కలలో దెయ్యాలు పీడిస్తున్నాయా..? పరిష్కారం ఏమిటో తెలుసా?
Read also : కుప్పలు కుప్పలుగా ఎయిర్పోర్టులో సూట్ కేసులు.. తలలు బాదుకుంటున్న ప్రయాణికులు!





