
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని అధికారులకు ఒక కీలక విన్నపం చేశారు. సంక్రాంతికి టోల్ ప్లాజా ల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. మరొక వారం రోజుల తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా పలు నగరాల నుంచి తమ సొంత గ్రామాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక ఇదే సందర్భంలో టోల్ ప్లాజా వల్ల వివిధ వాహనాల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరికి లేఖ రాస్తాను అని.. మరోవైపు మేడారం జాతరకు వెళ్లేటువంటి కొన్ని లక్షలాది మంది భక్తులకు ప్రయాణం సందర్భంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరికి లేక ద్వారా తెలియజేస్తాను అని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేషనల్ హైవేల పై ఉన్నటువంటి ప్రతి అంశం లో చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. ఏవైతే టోల్ ప్లాజా లు ఉంటాయో వాటి వద్ద రద్దీ లేకపోతే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం ఉండదు అని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ అంశంపై వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామని తెలిపారు.
Read also : Viral Video: ఇంతకన్నా అందమైన దోపిడీని మీరు చూపెట్టగలరా..? చూస్తే మాత్రం నవ్వాపుకోవడం కష్టమే!
Read also : నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి





