తెలంగాణ

కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ముదిరిన వార్.. RRR కేంద్రంగా సై అంటే సై

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రైండ్ బ్రాండ్ లీడర్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు. మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య ఇప్పుడు గ్యాప్ పెరిగింది. కొన్ని రోజులుగా అన్నదమ్ములు కలుసుకున్నది లేదు. మంత్రిపదవి చిచ్చు వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య మరింత చిచ్చు రాజేసింది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు భిన్నవాదనలతో ముందుకు వెళుతున్నారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో అన్న వెంకట్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. దీంతో బ్రదర్స్ మధ్య వార్ రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా రీజనల్ రింగు రోడ్డు అంశం అన్నదమ్ముల ఫైటింగ్ కు సెంటర్ గా మారింది.

కోమటిరెడ్డి సోదరుల మధ్య ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం అగ్గి రాజేస్తోంది. ఈ రోడ్డు విషయంలో ఇద్దరు చెరో వాయిస్ వినిపిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖమంత్రిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ట్రిపుల్ ఆర్ తన కలల ప్రాజెక్టుగా చెబుతున్నారు. తన శాఖ పరిధిలోనిది కావడంతో రీజనల్ రింగ్ రోడ్ పై వెంకట్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. రెగ్యులర్ గా రివ్యూలు చేయడంతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తరచూ సమావేశం అవుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ట్రిపుల్ఆర్ కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అన్నకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి.

ట్రిపుల్ ఆర్ రైతులు ఆందోళన చేస్తుండగా.. వాళ్లకు అండగా నిలుస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ట్రిపుల్ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు న్యాయం చేసేవరకు భూసేకరణ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో రైతుల కోసం అండగా ఉండేందుకు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని.. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే.. ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కీలక నేతలు. .పైగా సొంత అన్నదమ్ములు డిఫరెంట్ కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అన్నకు వ్యతిరేకంగా తమ్ముడే రంగంలోకి దిగడంతో హస్తం పార్టీలో గందరగోళం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button