తెలంగాణ

మంత్రులు,ఎమ్మెల్యేల సుట్టాల గ్రామాలకే రైతు భరోసా!

తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు కొత్త పథకాలను అమల్లోకి తెచ్చింది. అయితే ముందుగా చెప్పినట్లు రాష్ట్రమంతా కాకుండా మండలానికో గ్రామంలోనే అమలు చేసింది. రాష్ట్రంలో పట్టణాలు మినగా 563 మండలాలు ఉండగా.. మండలానికో గ్రామం చొప్పున 563 గ్రామాల్లో నాలుగు పథకాలను అమలు చేశారు. మొత్తం 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకి 6వేల చొప్పున మొత్తం 569 కోట్ల రూపాయలను జమ చేసింది. మరో 18వేల మంది రైతు కూలీల అకౌంట్లలోనూ 6వేల రూపాయలను జమ చేసింది.

తెలంగాణలో ఉన్న మొత్తం 12,774 గ్రామాలకు గాను 577 గ్రామాలకు అంటే 4.5 శాతం గ్రామాలకు రూ.569 కోట్లు రైతు భరోసా నిధులు ఇచ్చారు.. అది కూడా ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి తమ సొంత గ్రామాలకు, చుట్టాలు ఉన్న గ్రామాలకు ఇప్పించుకున్నారు. మా సుట్టాలు, బంధువులు ఉన్న గ్రామాలకే ఎంపిక చేయాలని మంత్రులు, ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంతో రాత్రికి రాత్రే గ్రామాలను ఎంపిక చేశారు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు.

మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, చుట్టాలు ఉన్న గ్రామాలకు మాత్రమే రైతు భరోసా నిధులు వచ్చాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముందు మా సుట్టాలున్న గ్రామానికి రైతు భరోసా ఇవ్వమని అధికారులకు నేనే చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలోనే చెప్పారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించగా రాత్రికి రాత్రే లిస్ట్ కావాలి అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి ఇచ్చుకుంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో తమ చుట్టాలు ఉన్న మసీద్ గూడ గ్రామానికి ఇవ్వమని RDOకి చెప్పానని బహిరంగ సభలోనే చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button