ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. విజయ సాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ శనివారం నాడు బులిటెన్ విడుదల చేశారు.

వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శనివారం ఢిల్లీకి వెళ్లి తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్‌కు ఇచ్చారు. దీంతో విజయసాయి రాజీనామాకు ఆయన ఆమోదం తెలిపారు. కాగా ఆంధ్ర రాజకీయాలలో జగన్ కి బంధువుగాను అలాగే వైసిపి హయాంలో ఎన్నో కీలక వ్యవహారాలు చూసుకునేటువంటి విజయ్ సాయి రెడ్డి ఇలా సడన్గా రాజకీయాలకు రాజీనామా చేయడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజలు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా సరే విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది వైసీపీ పార్టీకి నష్టమని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

1.ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజ్!… షాక్ అయినా అధికారులు?

2పబ్లిక్ లో కలెక్టర్ పై మండిపడ్డ పొంగులేటి!… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు?

3.బ్యాంకు అధికారిని ముంచిన స్కామార్లు!… ఏకంగా 78 లక్షల టోకర?

Back to top button