
– పలివేల పాఠశాలలో నూతన డేస్క్ బెంచిలు ఏర్పాటు
-కొత్త బెంచీలతో మురిసిపోతున్న విద్యార్దులు
-కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ లో మౌలిక సదుపాయాలు
-ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్దులు
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- వెనకబడ్డ నియోజకవర్గం అబివృద్ధి చేయడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా సమస్యలు తేలుకోవడానికి మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్నింగ్ వాక్ లో భాగంగా పలివేల పాఠశాలను సందర్శించారు.విద్యార్దులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మీకు వెంటనే సమస్య పరిష్కరిస్తానని విద్యార్దులకు హామీ ఇచ్చారు. విద్యార్దులకు ఇచ్చిన హామీ ప్రకారం తన సొంత ఖర్చులతో 7 లక్షల రూపాయల వ్యయంతో పలివేల ప్రాధమిక పాఠశాలలో విద్యార్ధులకు సరిపడా 110 బెంచీలను ప్రత్యేకంగా తయారు చేసి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ కు దీటుగా ప్రతి తరగతి గదికి నాణ్యత గల డెస్క్ బెంచీలు అందజేశారు. విద్యార్ధులు డెస్క్ బెంచీలు రావడంతో మురిసిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఎంఎల్ఏ కు గ్రామస్థులు ,విద్యార్దులు కృతజ్ఞతలు తెలిపారు.
Read also : IND vs PAK మ్యాచ్.. ఆసక్తి చూపని అభిమానులు!
Read also : రాత్రి బంద్.. పగలు ఫుల్.. శ్రీ వివేకానంద నగర్‌లో వీధి లైట్ల వింత.. పట్టించుకోని బస్తీ నేతలు