
-40 వేల రూపాయలతో సీలింగ్ ప్యాన్లు,ఎల్ ఈడి లైట్లు అందజేత
-యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి
-కృతజ్ఞతలు తెలిపిన గురుకుల పాఠశాలల విద్యార్దులు
-రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థినులు
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- మునుగోడు మండల వ్యాప్తంగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యములో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు బాలికల, బాలుర గురుకుల పాఠశాలలకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి 40 వేల రూపాయల వ్యయంతో 20 సీలింగ్ ప్యాన్లు, 20 ఎల్ ఈడి లైట్లు,20 ఛార్జింగ్ లైట్లు అందజేశారు.
Read also : తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భక్తుడిపై ఆటో డ్రైవర్ల దాడి.. భక్తుల్లో ఆగ్రహం!
ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్దులు కృతజ్ఞతలు తెలిపారు. కేక్ కట్ చేసి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని,ముందు ముందు పాఠశాలలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్,అబ్బన బోయిన రాము , జాల మణికంఠ బెల్లి పూర్ణచందు, చెరుకుపల్లి వెంకన్న, జనిగల ముత్యాలు, సాగర్ ,గ్రేగోరి, తీర్పారి ఆంజనేయులు, స్వామి, రాసమల్ల వెంకన్న, నక్క వెంకన్న, కట్కూరి మహేష్, లవ్ కుమార్, ఈద పవన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
Read also : ట్రంప్ చర్యలతో ఆర్థిక విధ్వంసం, అమెరికన్ ఆర్థికవేత్తల ఆగ్రహం !