తెలంగాణ

చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్స్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు ఉంది. గత 20 ఏళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాలుగు సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో తొలిసారి ఓడిపోయారు. అయితే ఆరు నెలల్లోనే భువనగిరి ఎంపీగా వెంకట్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇక తమ్ముడు రాజగోపాల్ రెడ్డి 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారే భువనగిరి ఎంపీగా గెలిచారు. 2014లో ఎంపీగా మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా కారు హవా వీచినా మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి హోరాహోరీ పోరులో ఓడిపోయారు. 2023లో తిరిగి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు రాజగోపాల్ రెడ్డి.

ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రిగా జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. అయితే కొంత కాలంగా ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకోవడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఇద్దరు సోదరులు కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లాలో జోరుగా తిరుగుతున్నా ఎక్కడా రాజగోపాల్ రెడ్డి కనిపించడం లేదు. దీంతో బ్రదర్స్ మధ్య గ్యాప్ మరింతగా పెరిగిందనే వచ్చిందనే వార్తలు వచ్చాయి.

సీఎం రేవంత్ రెడ్డ నల్గొండ పర్యటనతో సీన్ మారిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఒక్కటి చేసింది. సీఎం సభలో పాల్గొనేందుకు నల్గొండ వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. అన్న వెంకట్ రెడ్డితో కలిసి నవ్వుతూ కనిపించారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు . ఉదయం నుంచే సోదరులిద్దురు కలిసే ఉన్నారు. భువనగిరిలోని వివేరా హోటల్ నుండి బ్రాహ్మణ వెల్లంలకు ఒకే వాహనంలో వెళ్లారు కోమటిరెడ్డి బ్రదర్స్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కలిసే తిరిగారు కోమటిరెడ్డి బ్రదర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button