Tuesday, March 3, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కొల్లు రవీంద్ర..?!

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కొల్లు రవీంద్ర..?!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అందుకే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పై బలమైన చర్చ నడుస్తోంది. ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ ఎమ్మెల్యేల మధ్య హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా కొంతమంది మంత్రుల మార్పు ఉంటుందన్న ప్రచారం తెగ నడుస్తోంది. మంత్రి పదవులు నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు అనివార్యమని తేలుతోంది. ఎందుకంటే ప్రతి రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర అధ్యక్ష పదవి మారడం ఆనవాయితీగా వస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన పదవీకాలం ముగిస్తుండడంతో అనూహ్య వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం అయితే నడుస్తోంది.

నాగబాబుకు ఒక మంత్రి పదవి…
ఏపీ మంత్రివర్గంలో ఒక పదవి ఖాళీగా ఉంది. ఇప్పటికీ ఆ పదవిని నాగబాబు కోసం ఉంచారు. అయితే మరో ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. అందులో ఒకరు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. మెజారిటీల పరంగా రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనను తీసుకుంటే బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. అయితే వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అప్పట్లో ఛాన్స్ దక్కలేదు. అయితే అప్పటివరకు కింజరాపు అచ్చం నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవిని పల్లా శ్రీనివాస్ కు ఇచ్చారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రివర్గంలోకి తీసుకోనుండడంతో అధ్యక్ష బాధ్యతలు వేరే నేతకు అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురుకానుంది.

బీసీ నేతలకు పగ్గాలు..
2014 రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా టిడిపి అధ్యక్ష స్థానాలను భర్తీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014లో తొలిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు. అటు తర్వాత బీసీ నేతగా ఉన్న కింజరాపు అచ్చం నాయుడుకు అవకాశం కల్పించారు. ఆయన తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కింది. అయితే ఇప్పుడు ప్రముఖంగా కొల్లు రవీంద్ర పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే గాని జరిగితే మంత్రి పదవి నుంచి రవీంద్రను తొలగించి టిడిపి అధ్యక్ష బాధ్యత అప్పగిస్తారు. తెలుగు యువత ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొల్లు రవీంద్ర. 2009లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2014లో మాత్రం అదే పేర్ని నాని పై గెలిచారు. మంత్రి అయ్యారు. 2019లో మాత్రం అదే పేర్ని నాని పై ఓడిపోయారు. 2024లో పేర్ని నాని కుమారుడు కిట్టు పై ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో అమాత్య పదవిలో ఉన్నారు.

వీర విధేయ నేత..
సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కొల్లు రవీంద్ర. పార్టీకి పూర్తి విధేయతతో పని చేస్తారన్న పేరు ఉంది. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు అన్న పేరు ఆయనకు ఉంది. ఈ క్రమంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తానని కొల్లు రవీంద్ర చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొల్లు రవీంద్ర టిడిపి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. శాసనసభ లాబీల్లో దీనిపైనే చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…

మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూస్తూ ఉండండి..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments