
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తినే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముస్తఫా (30) అనే వ్యక్తికి సులేమాన్ (50) అనే వ్యక్తి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిపించాడు. అప్పటినుండి దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా, రెండు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ విషయంలో సులేమాన్‌ను బాధ్యుడిగా భావించిన ముస్తఫా, అతడిని కలుసుకుని తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ముస్తఫా తన వెంట తెచ్చుకున్న కత్తితో సులేమాన్ మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సులేమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ముస్తఫాను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.