
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటుగా రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి భారత సైన్యం ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అలాగే దేశంలోని సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయి అని.. తక్షణమే భారత సైనికుల అందరికీ కూడా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు భారత సైన్యాన్ని అవమానిస్తూ, శత్రు దేశాన్ని పూజిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సీఎం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మూడు పార్టీలకు కూడా కీలకంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు ఎంత కీలకమైనది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాలు విస్తృత స్థాయిలో చేస్తున్నారు. మా పార్టీని గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేయడంతో ఒకవైపు నాయకులు తో పాటు మరోవైపు ప్రజలకు కూడా ఎవరు గెలుస్తారు అని చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
Read also : టెస్లా.. టెస్లా.. త్వరలోనే ఎగిరే కార్లు వస్తాయంట?
Read also : “బాహుబలి ది ఎపిక్” ఫస్ట్ డేనే కలెక్షన్ల జోరు..!





