తెలంగాణ

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :-కోదాడలో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్ కలవరం సృష్టిస్తోంది.కిడ్నీ అవసరం ఉన్న వారి దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ కిడ్నీ రాకెట్ నడుపుతున్నారు. అందుకోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు.కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయి అని డి ఎస్ పి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణం లోని డి ఎస్ పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుపుతూ నిందితులు విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కడుపూరి తాతారావు(40),
కొండం రమాదేవి(32),బొందిలి పృద్వీరాజు(39),కొడాలి బాబూరావు(54),కందుకూరి విష్ణు(24),మహమ్మద్ సర్దార్(36) ఇంకా నలుగురు మొత్తం పది మంది నిందితులు ఒక ముఠాగా ఏర్పడి విజయవాడ లో గల కిడ్నీ డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కిడ్నీ భాదితులతో పరిచయం పెంచుకొని కిడ్నీ మార్పిడి చికిత్స చేయిస్తామని బాదితుల దగ్గర పెద్ద మొత్తములో డబ్బు తీసుకొని, కిడ్నీ మార్పిడి చికిత్స కు అవసరమైన క్లియరెన్స్ సర్టిఫికెట్ లు ఫోర్జరీ సంతకాలతో తయారు చేసి, బ్లడ్ శాంపిల్స్ మార్చి,డి ఎన్ ఏ కలిసే విధముగా రిపోర్ట్ తెప్పించుకొని, ఆపరేషన్ కు బాదితుణ్ణి, కిడ్నీ డోనార్ ను తయారు చేసి, హాస్పిటల్ లో ఆపరేషన్ ఫీజు కట్టకుండా వెళ్ళిపోయి అట్టి డబ్బులు మొత్తం అందరూ కలిసి పంచుకుంటారు.ఈ విధముగా 2024 డిసెంబర్ నెలలో కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం కి చెందిన సత్తూరి నరేష్ కు విజయవాడ లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడానికి, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, వారి స్టాంపులను గుంటూరు లో తయారు చేయించి, క్లియరెన్స్ సర్టిఫికెట్ లపై వేసి, 22 లక్షల రూపాయలు తీసుకొని, హాస్పిటల్ లో ఆపరేషన్ చేసే సమయములో డాక్టర్ కు డబ్బులు ఇవ్వకుండా పారిపోయినారు.ఇప్పటి వరకు మొత్తం 10 మందికి కిడ్నీ మార్పిడి చికిత్స చట్ట విరుద్దముగా చేసినారు.ఇట్టి కేసులో బుధవారం ఉదయం 8 గంటల సమయములో ఆరుగురి నిందితులను పట్టుబడి చేయడ మైనది.ఇంకా నలుగురు పరారీలో ఉన్నారు.ఇట్టి కేసును సీసీయస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ కె. శివ శంకర్ ఆధ్వర్యములో ఎస్ ఐ బి. సుధీర్ కుమార్ మరియు సిబ్బంది ఇట్టి కేసు లో కీలకం గా వ్యవహారించారు.వారిని కోదాడ డి ఎస్ పి యం. శ్రీధర్ రెడ్డి అభినందించడం జరిగినది.

దూడను కాపాడబోయి రైతు మృతి*

అది మీ తెలివి తక్కువ తనం.. పవన్ పై రెచ్చిపోయిన సత్యరాజ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button