- నకిలీ పిర్యాదులు తయారు..!? మండలాల వారీగా రిపోర్టర్లపై ఉన్న కేసుల వివరాలు సేకరణ..!?
- ఎవరితోనైనా మాట్లాడి పిర్యాదు ఇప్పించి, టాస్క్ ఫోర్స్ ప్రతాపం ఏంటో చూపాలంటున్న ప్రభాకరం..!?
- ఇది ఇలాగే వదిలేస్తే చిట్టా మొత్తం లాగుతారు.. ఇల్లీగల్గానైనా బ్రేకులు వెయ్యాలంటూ పెద్ద సారుతో బుడ్డోళ్ల స్కెచ్..!?
- పకడ్బందీగా ప్లాన్ చేసి లిఫ్ట్ చెయ్యాలని ప్రణాళికలు..!?
- ప్రజల వైపు నుండి క్రైమ్ మిర్రర్ ప్రశ్నల వర్షం.. జీర్ణించుకోలేని నల్లగొండలోని కొంతమంది పోలీసులు..!?
- గతంలో కూడా ఇదే లెక్కన క్రైమ్ మిర్రర్ ప్రతినిధులపై కేసులను సంధించిన నల్లగొండ పోలీసులు..!?
- విలువలు లేకుండా చేస్తున్నారంటూ న్యాయస్థానం మండిపాటు..!?
నల్లగొండ(క్రైమ్ మిర్రర్): చేస్తున్న తప్పులను ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న, క్రైమ్ మిర్రర్ పత్రికపై నల్లగొండ జిల్లా పోలీసులు పగ పెంచుకుంటున్నారు..!? కొడుకులు దొరికితే నలిపేయాలని, వాళ్లకు ఎంత దైర్యం ఉంటే పోలీసుల గురించే వార్త రాస్తారా అంటూ, పబ్లిక్ లోనే పండ్లు కొరుకుతున్నారు కొంతమంది పోలీసులు..!? గత జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఉన్న నాటి నుండి కూడా జిల్లాలోని పోలీసులు చేస్తున్న తప్పులను క్రైమ్ మిర్రర్ వేలెత్తి చూపిస్తూనే ఉంది… అప్పటి మాజీ ఐపిఎస్ లు క్రైమ్ మిర్రర్ కథనాల ఆధారంగా చేసుకొని విచారణ జరిపి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారని పాఠకులకు విధితమే..!?
కానీ ఇప్పుడున్న జిల్లా పోలీసుల వాతావరణం భిన్నంగా కనపడుతుంది.. వాడికి ఎంత దైర్యం ఉంటే మా బాగోతాలు బట్ట బయలు చేస్తారని, కట్టలు తెంచుకుంటున్న ఆవేశంతో పండ్లు కొరుకుతూ ఊగిపోతున్నారట..!? జిల్లా పోలీస్ అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలపై క్రైమ్ మిర్రర్ ప్రశ్నించడం తప్పా..? లేక పోలీసులు తప్పు చేయవచ్చని ప్రభుత్వం ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా…? ప్రజల పక్షాన నిలబడి క్రైమ్ మిర్రర్ ఒంటరి పోరాటం చేస్తుంది, తప్పు చేసిన వివిధ శాఖల అధికారులపై వార్తలు రాస్తూనే ఉంది.. వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని, విచారణ జరిపి తప్పు చేసిన అధికారులను శిక్షించాల్సిన జిల్లా అధికారులు, వార్తలు రాయడమే తప్పనే విధంగా పగ పెంచుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది..!?
కొంతమంది వ్యక్తులతో తప్పుడు పిర్యాదులు ఇప్పించి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధులను లిఫ్ట్ చేసి తీసుకువచ్చి, టాస్క్ ఫోర్స్ ప్రతాపం ఏంటో చూపాలి సార్ అంటూ సలహాలు ఇస్తున్నాడు ఓ ప్రభాకరుడు..!? పోలీసులకు లాఠి ఇచ్చింది లాఅండ్ఆర్డర్ ని కంట్రోల్ చెయ్యడానికి, కానీ ప్రశ్నించిన వారిని గొడ్డును కొట్టినట్లు కొట్టడానికి కాదని గుర్తించాలి..!? జరిగిన వాస్తవాలను, మకిలీ పట్టిన నిజాలను క్రైమ్ మిర్రర్ ప్రచురణ చేస్తున్నందుకా, ఈ కక్ష సాధింపు చర్యలకు సిద్దపడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. గతంలో ఓ అవినీతిపై వరుస కధనాలు ప్రచురించిన క్రైమ్ మిర్రర్ ప్రతినిధిపై తప్పుడు కేసులు పెట్టించిన సంఘటనలు మరిచిపోక ముందే, మరో సారి స్కెచ్ లు వేస్తున్న డిపార్ట్మెంట్ పై జిల్లా వాసులు అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.. ఆ తప్పుడు కేసును చూసిన న్యాయ స్థానం విలువలు లేకుండా చేస్తున్నారంటు, పోలీసులను మొట్టికాయలు వేసిన పరిస్థితి పాఠకులకు విధితమే.. వచ్చిన వార్తలపై విచారణ జరిపి తప్పు ఒప్పులను సరి చూడాల్సిన జిల్లా యంత్రాంగం, పగ సాధింపు చర్యలపై జోరుగా చర్చ జరుగుతుంది..!? ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్, డబుల్ ధమాకా కానిస్టేబుల్ వేస్తున్న స్కెచ్ లను ప్రజలు చూస్తూనే ఉన్నారు..!? ప్రశ్నించే గొంతుకగా క్రైమ్ మిర్రర్ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఉంటుందని మరిచిపోవద్దు.. త్వరలోనే బాధితులకు న్యాయం జరిగే దిశగా, న్యాయ స్థానం వైపు అడుగులు వేసే సమయం దగ్గర్లోనే ఉందని, ఈ అక్రమ కేసులు క్రైమ్ మిర్రర్ గొంతును నొక్కెయ్యలేదని గుర్తుపెట్టుకోవాలి.. ప్రజా ప్రభుత్వం పోలీసులకు ఇదే చెబుతుందా.. లేక మా పోకడ ఇంతేలే అనే విధంగా ప్రవర్తిస్తున్నారా అనే అంశం అర్ధం కాని పరిస్థితి..!?
త్వరలోనే సాక్షాధారాలతో గుట్టును రట్టు చేసే ప్రణాళికలో క్రైమ్ మిర్రర్ అడుగులు వేస్తుంది..
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..