క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్ల, ములకలచెరువు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజిబివి) పాఠశాలలో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు తమ కష్టాలను అధికారులకు వెల్లడించారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు కేజీబీవీ పాఠశాలలో అధికారులు సామాజిక తనిఖీలు చేశారు. అయితే ఇందులో బాలికలు చెప్పినటువంటి విషయాలు చాలా దారుణంగా అనిపించాయి.
మంత్రులు,ఎమ్మెల్యేల సుట్టాల గ్రామాలకే రైతు భరోసా!
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. నెలసరి సమయాల్లో విద్యార్థులు సిబ్బందిని శానిటరీ ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు అధికారులకు చెప్పుకొచ్చారు. అలాగే తలస్నానం చేస్తే ఏకంగా 100 రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు అని అన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేపి విద్యార్థుల చేత చపాతీలు చేయిస్తున్నారని అధికారులకు చెప్పడంతో వాళ్లు కూడా ఒకసారిగా షాక్ కు గురయ్యారు. అన్నంలో అప్పుడప్పుడు పురుగులు వస్తున్నాయని సిబ్బందిని ప్రశ్నిస్తుంటే వాళ్లు మార్కులు తగ్గిస్తామని చెప్పడంతో మేము సైలెంట్ గా ఉండిపోతున్నామని విద్యార్థులు అధికారులకు చెప్పుకొని వాపోయారు. దీంతో అధికారులు ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయాలన్నిటిని కూడా మీడియా వేదికగా వివరించారు.