ఎలక్షన్ సమయంలో జనసేనకు పవన్ కళ్యాణ్ తో పాటుగా నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. ఇక జనసేన వేసిన ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ తో పాటుగా నాగబాబు కూడా అన్ని విషయాల్లోనూ ముందుండి నడిపించారు. మరి ఎలక్షన్స్ సమయంలో జనసేనకు ఇంతగా ముందుండి గెలుపుకు కృషి చేసిన నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. నాగబాబు కోసం ఏకంగా ఢిల్లీ వెళ్లి కూటమి నాయకులతో మాట్లాడనున్నాడు.
జనసేనలో కీలకపాత్ర పోషించినటువంటి నాగబాబుకు ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లే విధంగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై బిజెపి పెద్దలతో జనసేనకు రాజ్యసభ సీటుపై చర్చించనున్నారు. గతంలో వైసీపీకి ఉన్నటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాజాగా రాజీనామా చేయగా వీరు స్థానంలో ఇద్దరు టిడిపి నాయకులు మరొకరు జనసేన నాయకులను కేటాయించాలని కోరుతున్నారట.
ఇక ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ నేతలు కూడా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం అయితే అందింది. ఇక త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన గెలుపుకు ముఖ్యపాత్ర పోషించారు నాగబాబు. అలాంటి నాగబాబుకు ఈ రాజ్యసభ సీట్ అనేది కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పిస్తారని నమ్మకం ప్రతి ఒక్కరులోనే ఉంది అంటూ జనసేన నేతలు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!