
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- చాలా రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ నా ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్ చేశారు అని కేటీఆర్ కొండ సురేఖ పై పరువు నష్టం దావా కేసు వేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు పై నాంపల్లి స్పెషల్ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు న్యాయస్థానం ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 5 న జరుగుతుంది అని ఈ లోపు మంత్రి కొండ సురేఖ హాజరు కాకపోతే వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని నాంపల్లి స్పెషల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఎన్నో రోజుల క్రితం వేసిన ఈ కేసు పై తాజాగా కోర్టు ఆదేశాలను ఇవ్వడంపై రాష్ట్రంలో మళ్లీ ఉత్కంఠత నెలకొంది. మరి దీనిపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Read also : చిల్పకుంట్లలో సత్తా చాటిన సిపిఎం పార్టీ అభ్యర్థులు
Read also : Modi-Putin Selfie: మోడీ-పుతిన్ సెల్ఫీ.. ట్రంప్ పై అమెరికన్ల విమర్శలు!





