
బిహార్ ఎన్నికల్లో ఈసారి గెలుపు తమదేనని నమ్మిన కాంగ్రెస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఎన్డీయే అంచనాలకు మించిన భారీ విజయం సాధించడంతో కాంగ్రెస్ అట్టడుగు స్థాయిలోకి చేరిపోయింది. పార్టీ అంతర్గత విశ్లేషణ ప్రకారం.. ఓటమికి మూడు ప్రధాన కారణాలు ప్రభావం చూపాయి. బీసీ, ఈబీసీ వర్గాలకు చేరువ కావాలనే ప్రయత్నంలో ఉన్నత వర్గాల మద్దతు కోల్పోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది.
గతంలో ఎన్డీయేలో ఉన్న అభ్యర్థులను తమవైపు తిప్పుకుని టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ అసలు గుర్తింపు దెబ్బతింది. అలాగే SIR, ఓట్ చోరీ అంశాలను ప్రజల్లో బలంగా ప్రదర్శించడంలో విఫలమైనందువల్ల భావోద్వేగ ఓటును కూడగట్టుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే 200కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో కాంగ్రెస్ ఓటమి స్పష్టమైంది.
ALSO READ: Snake bite: పాము కాటు వేస్తే మనిషి ఎంత సేపటిలో చనిపోతాడో తెలుసా?





